అల్లంత దూరాన్నుండి
ఆశగా పలకరిస్తావు
గతకాలపు మురిపాల
స్మృతులను నెమరు వేస్తూ
తలపుల లోతుకు అడుగిడి
ఎదలోయలో నిద్రిస్తున్న
చేదు జ్ఞాపకాలను
భ్రమరమై రెచ్చకొడుతూ
గుండెకు గాలాన్ని
గుచ్చుతావు మురిపెంగా
మన అనుభూతులకు
మరణంలేదంటూ
నీగుమ్మం వాకిట
నన్ను నిలుచోబెట్టి
సూదంటురాయి రాపిడితో
అదేపనిగా తలపును కోస్తూ
నీఆలోచనాల
ప్రపంచంలోనే
నామనసు భూమికను
పరిభృమింపజేస్తావు.
కల(త) లతో
బరువెక్కిన గుండెకు
రవ్వంత సేదను
సమకూర్చుతావు.
నీవు ఆవిరి అవుతూ
నిర్మలంగా నన్ను
ఉండమంటావేం నేస్తం.
ఇదేనా నీకు
తోచిన ధర్మం
ఇదేనా నాకు నీవు
చెప్పెడు న్యాయం.
ప్రశాంత కడలి గర్భాన
కనలేని అగ్నిపర్వతాలు
అవిచ్చిన్నంగా నీలో
మండుతున్నగోళ గాయాలు
నీ చిరునగవులోని
దరహస మౌనగానం
ఉదజనిలేని భావకవికి
హరతి పట్టిందీ కవితగా.
12/10/2012.
గతకాలపు మురిపాల
స్మృతులను నెమరు వేస్తూ
తలపుల లోతుకు అడుగిడి
ఎదలోయలో నిద్రిస్తున్న
చేదు జ్ఞాపకాలను
భ్రమరమై రెచ్చకొడుతూ
గుండెకు గాలాన్ని
గుచ్చుతావు మురిపెంగా
మన అనుభూతులకు
మరణంలేదంటూ
నీగుమ్మం వాకిట
నన్ను నిలుచోబెట్టి
సూదంటురాయి రాపిడితో
అదేపనిగా తలపును కోస్తూ
నీఆలోచనాల
ప్రపంచంలోనే
నామనసు భూమికను
పరిభృమింపజేస్తావు.
కల(త) లతో
బరువెక్కిన గుండెకు
రవ్వంత సేదను
సమకూర్చుతావు.
నీవు ఆవిరి అవుతూ
నిర్మలంగా నన్ను
ఉండమంటావేం నేస్తం.
ఇదేనా నీకు
తోచిన ధర్మం
ఇదేనా నాకు నీవు
చెప్పెడు న్యాయం.
ప్రశాంత కడలి గర్భాన
కనలేని అగ్నిపర్వతాలు
అవిచ్చిన్నంగా నీలో
మండుతున్నగోళ గాయాలు
నీ చిరునగవులోని
దరహస మౌనగానం
ఉదజనిలేని భావకవికి
హరతి పట్టిందీ కవితగా.
12/10/2012.
...
రామాచారి బంగారు.రచనా కాలం;
12/10/1982.
No comments:
Post a Comment