Tuesday, June 4, 2013

Ramachary Bangaru క్రిష్ణ మేఘాలు కురులువిప్పి ఆరబెట్టుకుంటే
కోనసీమ అందాలు వింజామరలై వీస్తున్న తరుణాన
తరుణీమణీ మదిలోని కోరికలు సిగ్గుల మొగ్గలై
పూస్తున్న వేళా రగులుతున్న మొగలిపొదన
బుసలుకొడుతున్న జంటను గని మరులుగొన్న
మన్మధుడు అదునుచూసి పదునైనా విరిబాణాలను వడివడీగా వదలడా.
July 17 at 2:55pm • Unlike • 8


Ramachary Bangaru బాలభానుని నులివెచ్చని కిరణాలతో ఆమని
రాత్రంతా స్రవించిన అశ్రువులతో అరుణిమలా తోస్తుంది
కొన్ని కాగితపు పూలు మరికొన్ని మందారాలుండొచ్చు
ఈ చెట్టు నీడలో సేదదీరబోయే ప్రేమికులకు ఖాళీ బల్ల
ప్రేమసింహసనమై స్వాగతం పలకొచ్చు
తరుణీమణి నుదుట సింధూరమై భాసిల్లునేమో
గతం కన్నా వర్తమానమెప్పుడు వైవిద్యభరితమే.
July 15 at 5:32pm • Unlike • 8


Ramachary Bangaru నీతలపులతో మురిసి నామది నిండగా
నీకే చెప్పాలని దాచుకున్న వూహలకు రెక్కలొచ్చి
యెగిరిన వేళ నీకొసం నీ రాకకోసం వేచిన
చకోరి లాంటి నాకు వేకువనే నీపాదమంజీరవర
స్వరంలతో అనురాగవర్ణాల ఆమని వై వచ్చావు
ఈజగతిలో రాగరంజితాలు హరివిల్లుల జంటగా విరిసాయి/మురిసాయి..
July 14 at 10:50am • Unlike • 10


Ramachary Bangaru మురిపాల ప్రేమ ముద్దుగుమ్మ మొహంపై
లేతచిరునవ్వై వలపుగులాబిగా మురిసిపోతుంది
ముగ్ద మనోహరి ఇక సిగ్గుల మొగ్గగా పూయనుంది
జంట వలపుతలుపుల స్వప్నాలు ఫలించినవేళా
ఈజగతికే అమని శోభల ఆగమనమే కదా.
July 10 at 5:51pm • Unlike • 7


Ramachary Bangaru ప్రక్రుతిమాత శోకం కట్టలుతెగిన అగ్రహంతో
కడలి కెరటాలమాదిరి కన్నెర్ర జేసిన ఆక్షణంలోనే
ఈ జగతిలోని మనందరి జీవితాలు టప్పున పేలే
నీటిబుడగలే అన్నది నిజం సుమా
నిదానించి నింపాదిగా గనుమా మిత్రమా.
July 11 at 10:20am • Unlike • 9


Ramachary Bangaru పాలబుగ్గల పసిడికాంతుల
చిన్నారిబాలుని చిరునవ్వుల
జలపాతంలో తడిసిముద్దైన
ఈతనేర్చిన ఈతాత వానిలో
తన చిన్ననాటి తలపుల
మైకంలో తలమునకలైనాడు
ఆటంకపర్చకుండ అవలోకించండి.
July 12 at 9:25am • Unlike • 8


Ramachary Bangaru అనుక్షణం అవేదనలతో దిగులు మేఘాలగర్జనల
పరివ్యాపితతో మసకబారి భారమైన ఆకాశమంటి ఇంతి మనసుకు
సాక్షిగా భారజలమంటి కన్నీటి బొట్టు భారంగా స్రవిస్తుంది
జారిపడేకన్నీటి అణుకణం క్షణంలోనే అణ్వాస్త్రమే ఈ జగతిని
కడతేర్చకమునుపే అజ్ఞానాన్నీ వీడి జాతిమనుగడకోసం
దైవకణం కన్న మిన్నైన మూలకణంవంటి పుడమి
తల్లిలాంటి తరుణీమణులను కాచుకుందాం
July 10 at 9:14am • Unlike • 6


Ramachary Bangaru ఆదారంటా పర్చుకున్న ఆకుపచ్చనిదనం
చిలకపచ్చ చీర కట్టుకున్న అమ్మలాగాకనిపిస్తుంది కదూ
వూరికివెల్ళ్తానన్నప్పుడు ఎదురొచ్చి అంతామంచే జరగాలి అనే అమ్మలా
ఈదారంటాపొతున్నారు ఈజగతిని పరిరక్షించే దాతలు,భావితరాలకు
స్ఫూర్తిదాతలు మీరేకావాలంటున్న చెట్ట్లనీడలో సేదదీరి పొగొట్టుకున్న
చిన్నప్పట్టి అమ్మవొడితాలుకు కమ్మదనంలో వోలలాడుదామా
July 8 at 7:46pm • Unlike • 6


Ramachary Bangaru చిత్రంలోని కమనీయ ద్రుశ్యం నుండి కనుపాపల ద్రుష్టి మరలచకండి
అప్యాయతలనే పోచలతో కట్టిన గుడిలో ప్రేమల వర్షంలో పరవశించండీ
ఇల్లు విశాలంగా లేకున్నా ఈజగతిలో మీ హ్రుదయాన్ని విస్త్రుతపరచి
కనీసం మీ కుటుంబంతోనైనా అనుబంధాన్ని పంచుకోండి
మీరు మూటగట్టిన సంపదలేమి మిగలవు లేండి
చిత్రంలోని గూడు తుఫానులను ఎదిరించి నిల్చుంటుంది
ఇది మాత్రం తరతరాలకు చెరగని తరగని సత్యం సుమండీ.
July 7 at 9:52am • Unlike • 12


Ramachary Bangaru మదిలోని చెలికాడు
భువిపై నానెలరేడు
అరుదెంచనున్నాడు
నేడు కలువను నేను
రాబోయె చంద్రుడు తాను
మది ఆనందాల నిండుకుండ
తనసన్నిధిలో నేను బోర్లేసిన కుండ
July 7 at 7:55am • Like • 6


Ramachary Bangaru కాలం-కడలి-ప్రేమతీరం.
రచనాకాలం
01.07.2012
చిన్నప్పుడెప్పుడో నేను
నీతోకూడా వచ్చికట్టిన
పిచ్చుక గూళ్ళను
కబళించే క్రమంలో
కెరటాలను బుజ్జగించేసి
గూళ్ళలను నిలిపి నిన్నునన్ను
పరవశింపజేసినవాడు
సాగరుడు గుర్తున్నాడా?
బాలరాముడిగా నేను
మురిపాల మల్లిగా నీవు
మురిపెంతో చేమంతిలాంటి
బంతిని మనం విసిరేసి
బిక్క మోహలతో
చిన్నబుచ్చుకున్నాం
తాను గద్దలా మింగినా
ఇవతలకు నెట్టిన బంతితో మనకు
చిరునవ్వులు పంచాడు మిత్రమా
కలసి మనం రాలేదని
కాలం కూడా తనకుతాను
కడలిగామారి తన గోసను
రాతిపర్వతాలను కోసే
కన్నీటిగొంతుకతో ఎనలేని
రోదనలతో ఘోషిస్తుంది విన్నావా
వినీల క్రాంతి ప్రతిభావర్తనమా.
ఈ కడలి అంచున ఎన్నో ఏళ్ళుగా
నా అన్వేషణం నీకోసమే కదా
అలల గలగలకు నాపాదముద్రలు
తుడుచుకుపోవచ్చునేమో గానీ
మదిలోని వూహల వూసులకు ఆశల
మొలకలెత్తిన వేళా రాయంచగా మారి
రేయి పగలు నీధ్యాసలోనే నాజీవనం
కనిపించవేమి నేస్తం కనులారా చూడగా
చితిలోనైన నిలిచి వెలిగేదే నీపైనాకున్న
ప్రేమంత నిజం నన్ను చూడవేమి ప్రేయసి
నాదొక విన్నపం వినండి సకలజనులారా
గ్రహంతరాలలోఇ జీవరాశిని శోదించిన
మహోన్నత విజ్ఞ్యాన శాస్త్రవేత్తల్లారా
చిన్ననాటి నాచిరు నేస్తం
ఒకనాటి నాప్రేమదేవతను
నాప్రాణానికి ఆమే ఉదజనీని
ఈకడలి అంచున నిలిచి పొందిన
ఆనందాన్ని తిరిగి పొందగలనా?
మీరే చేతులెత్తినాక
ఆమె సాన్నిత్యం లేని ఈజగతిలో
నాకిక మిగిలిన ఈ సంపదలన్ని
పిచ్చివాడు తొడుగుకున్న
చిరుగుల కోటులో దాచుకున్న
చింపిన గాలిపటాలే కదా.
ఈకడలి అంచున నిలుంచొని
కడసారిగా ప్రార్దిస్తున్నా మిత్రులారా
ప్రేమను మించిన పెన్నిది లేదన్నా
తోటరాముడిలా నేనేమి వీరుణ్ణి కాను
శిధిలమైన ఈ గుండె గుడిలో
ప్రేమ దివ్వెను వెలిగించలేను
మ్రుత్యువు కరుణకోసం ప్రేమనే
శిలాసుందరిని కంఠాభరణమని
సాదరంగా స్వాగతిస్తాను
సాగరుడు అన్నింటిని ప్రేమతో
తనలోకి లాక్కుంటాడు అట్లాగని
తనలోని సంపదలన్నింటిని
దేన్ని దాచుకోడు చివరికి
(వి) గతజీవినైన నన్నుకూడా
వొడ్డున పడవేస్తాడు
నిశ్చలంగా,నిర్దాక్షిణ్యంగా
వర్తమానంలోని సమాచారంగా
రేపటి తరాలవారి చరిత్ర కోసం
ప్రేమసంపుటంలో ఒక పేజిగా
( తాత వయస్సులోనున్న మాలాంటి వాళ్ళ చేత కూడా ప్రేమ కవితలు
వ్రాయిస్తున్న ఎందరో ప్రతిభామూర్తులైన గ్రూపుల నిర్వాహకులకు
దన్యవాదాలతో )
July 1 at 6:35pm • Unlike • 1


Ramachary Bangaru ఆమనిలో కోయిల పాడిన
వలపు వసంతాల గారాల
సరాగాల, అమ్రుత గానానికి
ఆకాశంలోని హరివిల్లులన్ని
వర్ణమాలకు హరం కాగా,
దివినుండి ప్రేమ దేవత
నవరాగాల నగుమోముతో
నా వలపువనాన వరాలిచ్చే
ప్రేమమూర్తిగా దర్శనమిచ్చింది
ఈమూగ ప్రేమికుడి మదినిండా
పరవశపు సుధానందాల జడివానే కదా.
July 1 at 10:28am • Unlike • 3


Ramachary Bangaru ఈ జగతిన అత్యంతధనవతుడిగా
విఖ్యాతినొంది విలసిల్లుతున్నా
నీప్రేమకై తపిస్తున్న అభ్యాగున్నీ నేనే
ఫకీరును నేనే వో అమ్మీ,
నన్ను నామాటలను నమ్ము వో సుమ్మీ.

July 1 at 11:19am • Unlike • 2