Tuesday, October 23, 2012

ఆకాంక్ష.


సుందర నందనోద్యాన వనంలో
చిరుకుటీరం నిర్మించుకుందాం
నేను మౌనగీతాలు ఆలాపిస్తాను
నీవు మధురగీతాలు పాడుతావు
ఎడతెగని నీ చిరుననవ్వు వెన్నెల
జడివానలో తడసి ముద్దవుతాను
కారుణ్య నీకనురెప్పల వుయ్యాలలో
వూగివూగి 
లసి నిద్రిస్తాను

బాధల వ్యధల కతీతమైన
మరొలొకంలో మనమేవుంటాం
నీఅనురాగ గంగలొ వోలలాడించు
తరంగిణీ, అనంతరాగభావవాహినీ.

రచనా కాలం.01.12.1982.

ఆశకు ఫలితం.


నువ్వు వస్తావని 
కొమల హస్తాలతో
చేరదీసి లాలించి
చెలి సిగలో తురుముతావని

ఆశలతో విరబూశాను
ముంగిట ముగ్గులు వేశాను
నిలువెల్ల కనులతో దారంటా 
స్వాగత తోరణమైనాను

కళ్ళ్లలొ వత్తులతొ నిలిచాను
ఎదను సుమంగా పరచాను
వేచి వేచి వేదనల పాలై
పండుటాకుగా నేల రాలాను.

రచనా కాలం. 19.11.1982

నాన్నకు నీరాజనం.


మానాయన చేతిలో ఎక్కువగా దండించబడ్డవాణ్ణి నేనే. అంతేకాదు ఆయన ప్రేమను ఎక్కువగా పొందింది కూడా నేనే . శత్రువున్ని సైతం క్షమించే మహోన్నత గుణం కలిగిన మానాయన విశిష్ట లక్షణాలను జీవితాంతం మర్చిపోలేను . ఇప్పటికి ఎదైన విషమ సమస్య వచ్చినప్పుడు నాయనకే నివేదిస్తాను. కలలొ కచ్చితంగా ఒక పరిష్కారమిస్తాడు. ఇది అక్షర సత్యం.ఆమహనుభావుడి పెద్ద కొడుకుగా పుట్టడమే గొప్ప వరమని భావిస్తా. తాను చెప్పిన గొప్ప సుభాషితం "ఎవరైనా నిన్ను చూసి ఏ డిచేలా ఎదగాలి " ." నీవు ఒకరి కొడుకుగా కాదు ఒకరికి అయ్య లాగా బతకాలి". ఈ రెండిటిని ఎప్పటికి మరువను నేను.

ఎదలోనివేదన/ ఎదలో(ని)వేదన/ ఎదనివేదన/ ఎద(లోయ)నివేదన.

రాగమా, నాహ్రుదయానురాగమా
వేగిరపడి సాగనీకుమా నీపయనం
సాగినా, పొంగినా మిగులునే శూన్యం = రాగమా=

కలతలకు తోడైన కన్నీరుగా
వినిపించని చిరుమువ్వలసవ్వడిగా
అడవిలో వెన్నెల మల్లెల జలపాతంగా
నిటూర్పులుగా మిగిలిన నిన్నటి తీపిగుర్తులుగా
చితిలో నిలిచి వెలిగే మంటలుగా
ఎడారిలో వానకోయిల పాటగా =రాగమా=

నేటికలలు రేపటి ఆశలకు పొదరిండ్లు
చేరువలో నువ్వుంటే దరిజేరవు కన్నీళ్ళు
ఆకాశంలా సువిశాలమైందీ హ్రుదయం
చిరుగుల గాలిపటంలా ఎగురలేదు పాపం
చమురు తగ్గి గుడ్దిగా వెలిగేను దీపం
గాలి వీచిన వేళ అలుముకునేను అంధకారం =రాగమా=

మ్రుత్యువు రాకకై ఈనాడీ స్వాగత *గీత తోరణం
ఆశ అవేదన నడుమ గడిపేను అనుక్షణం
ఆసన్నమైనది జీవన సంధ్యాసమయం
అందుకే ఈ ఆక్రోశం, ఆగనిది జీవనపోరాటం
మంచుశిల్పం ఆలాపిస్తుంది మౌనగీతం
ఆనందంతో నీవు పాడాలి వీడ్కోలు గీతం. =రాగమా= 

రచనాకాలం.13.01.1983.
ఇది అనుస్రుజనగీతం.(స్వర్గీయ వేటూరి గారికి నివాళిగా సమర్పణ)

దర్శకుదు వంశీగారు తొలిసారి దర్సకత్వం వహించిన సినీమా "
మంచుపల్లకి " హైదరాబాద్, నల్లగొంద, సూర్యాపేట మొదలగు
పట్టణ్ణాల్లో చూసినప్పుదు కలిగిన కన్నీటిభావనలకు
అక్షరరూపమే ఈ గీతం. * గీత ఈ సినీమాలోని హీరోయి
ను పేరు.



మహిత మూర్తులందరి పాద చరణములకు.

ఈజగతి స్రుష్టికి జీవనలయకారిణి
కారుణ్యమూర్తి కరకమలములలో
కరుణాక్రుతి దాల్చిన సుమసుకుమార
హంస మంజీరాలవంటి ఆ చిగురుపాదాలు

దివినుండి భువికి దిగిరానని మారాంచేసిన
గారాలపట్టి దేవతమూర్తి సధ్రుశ్యంగా
నర్తించే పాద సవ్వడుల నాద మంజీర
మంగళ రవముల మెరుపులభావనలకు

తోడైన ఆనందభైరవి రాగలహరిలో
వనదేవతలు పలవరింతులుకాగా
అవనిమాత మదిలో పులకరింతల
శ్రావణమేఘాలు వర్షించగా

నదీమాతలుల్ల మాత్రుహ్రుదయాల్లో
మమతల గంగాప్రవాహములుప్పొంగవా
ఇడుములలోనున్నవారిని అక్కునచేర్చుకుని
స్వాంతన ప్రవచనాలతో సేదదీర్చే 

సేవామూర్తులందరి రూపాల్లో 
ప్రతిఫలించే భారతరత్నగా 
ఘనతిపొందినా విశ్వమాతగా 
విఖ్యాతినొందినా

అంతరిక్షయానంలో
ఆత్మార్పణజేసి
మానవజాతి వర్దిల్లడానికి 
వారధిగా నిలిచినారు

ఈధరణీపై వెలసిన 
మహనీయ,మాననీయ
మహిత మూర్తులారా అందుకోండి 
ఈ జగతి నీరాజనాలు.





రచనాకాలం.09.03.2012

కొవ్వొత్తి నాయన


కంటి చూపు తగ్గినా
కడుపుతీపి చంపుకోలేక
కన్నబిడ్డల కోసం
కటిక చీకటిలో సైతం
కర్షకుడిలా శ్రమించి
కొవ్వొత్తిలాగా తాను
కరిగి మాజీవితాల్లో
కాంతిరేఖల వెలుగై
కమలినాడు మానాయన.

రచనా కాలం. 09.07.1982

కాలం-కడలి-ప్రేమతీరం.

చిన్నప్పుడెప్పుడో నేను
నీతోకూడా వచ్చికట్టిన
పిచ్చుక గూళ్ళను
కబళించే క్రమంలో


కెరటాలను బుజ్జగించేసి
గూళ్ళలను నిలిపి నిన్నునన్ను
పరవశింపజేసినవాడు
సాగరుడు గుర్తున్నాడా?


బాలరాముడిగా నేను
మురిపాల మల్లిగా నీవు
మురిపెంతో చేమంతిలాంటి
బంతిని మనం విసిరేసి


బిక్క మోహలతో
చిన్నబుచ్చుకున్నాం
తాను గద్దలా మింగినా
ఇవతలకు నెట్టిన బంతితో మనకు


చిరునవ్వులు పంచాడు మిత్రమా
కలసి మనం రాలేదని
కాలం కూడా తనకుతాను
కడలిగామారి తన గోసను


రాతిపర్వతాలను కోసే
కన్నీటిగొంతుకతో ఎనలేని
రోదనలతో ఘోషిస్తుంది విన్నావా
వినీల క్రాంతి ప్రతిభావర్తనమా.


ఈ కడలి అంచున ఎన్నో ఏళ్ళుగా
నా అన్వేషణం నీకోసమే కదా
అలల గలగలకు నాపాదముద్రలు
తుడుచుకుపోవచ్చునేమో గానీ


మదిలోని వూహల వూసులకు ఆశల
మొలకలెత్తిన వేళా రాయంచగా మారి
రేయి పగలు నీధ్యాసలోనే నాజీవనం
కనిపించవేమి నేస్తం కనులారా చూడగా


చితిలోనైన నిలిచి వెలిగేదే నీపైనాకున్న
ప్రేమంత నిజం నన్ను చూడవేమి ప్రేయసి
నాదొక విన్నపం వినండి సకలజనులారా
గ్రహంతరాలలోఇ జీవరాశిని శోదించిన


మహోన్నత విజ్ఞ్యాన శాస్త్రవేత్తల్లారా
చిన్ననాటి నాచిరు నేస్తం
ఒకనాటి నాప్రేమదేవతను
నాప్రాణానికి ఆమే ఉదజనీని





ఈకడలి అంచున నిలిచి పొందిన
ఆనందాన్ని తిరిగి పొందగలనా?
మీరే చేతులెత్తినాక
ఆమె సాన్నిత్యం లేని ఈజగతిలో


నాకిక మిగిలిన ఈ సంపదలన్ని
పిచ్చివాడు తొడుగుకున్న
చిరుగుల కోటులో దాచుకున్న
చింపిన గాలిపటాలే కదా.


ఈకడలి అంచున నిలుంచొని
కడసారిగా ప్రార్దిస్తున్నా మిత్రులారా


ప్రేమను మించిన పెన్నిది లేదన్నా
తోటరాముడిలా నేనేమి వీరుణ్ణి కాను


శిధిలమైన ఈ గుండె గుడిలో
ప్రేమ దివ్వెను వెలిగించలేను


మ్రుత్యువు కరుణకోసం ప్రేమనే
శిలాసుందరిని కంఠాభరణమని


సాదరంగా స్వాగతిస్తాను
సాగరుడు అన్నింటిని ప్రేమతో 


తనలోకి లాక్కుంటాడు అట్లాగని
తనలోని సంపదలన్నింటిని


దేన్ని దాచుకోడు చివరికి
(వి) గతజీవినైన నన్నుకూడా
వొడ్డున పడవేస్తాడు


నిశ్చలంగా,నిర్దాక్షిణ్యంగా
వర్తమానంలోని సమాచారంగా
రేపటి తరాలవారి చరిత్ర కోసం
ప్రేమసంపుటంలో ఒక పేజిగా





రచనాకాలం
01.07.2012
( తాత వయస్సులోనున్న మాలాంటి వాళ్ళ చేత కూడా ప్రేమ కవితలు
వ్రాయిస్తున్న ఎందరో ప్రతిభామూర్తులైన గ్రూపుల నిర్వాహకులకు
దన్యవాదాలతో )

వానకాలం-వనవాసం-వానవాసం

వానదేవుడు కరుణించి కార్తెల
కాలంలోనే వర్షాలు కురిపిస్తాడూ
సమ్రుద్ధిగా పంటలు పండుతాయాన్న
కోటి ఆశలతో ఉన్నవన్నితెగనమ్మి


విత్తనాలు చల్లిందీ కర్షకలోకం
చుక్కరాలక దిక్కుతోచక వానచుక్కకోసం
ఆకాశంకేసి ఎదురుచూపులతో
ఏడిచ్చిమొత్తుకున్నా కనుచూపు మేరలో


మేఘం జాడ కనపడదాయి
పాడియావు వంటి వ్యవసాయం పడావుపడి
వున్నవూరుకన్న దున్నిన నేలకన్న
పెంచిన అమ్మ కన్న ఆ కాడు(అడవి)


మిన్న అని వెతలగోసలతో తలపోసి
వలసగా వనవాసమేగపోదామని
చాటింపు చేసి సాగే తరుణంలో
అదేమిచిత్రమో ఈతరుణం దప్పిందా


తనను ఈజనం నన్ను ఆగమాగంగా
తిట్టి సాపించి సానిపిజల్లుతారన్న
అదురుతో గాలిదేవుడికి మొక్కి
అయ్యా నువ్వు కాస్తా ఆగవయ్య





తండ్రి అనిబతిమాలి వరుణుడు
ఆగమేఘాలతో అచ్చి కురవంగా
కుంటలు, చెరువులు నిండంగా
అలుగులు పోయంగా. అలిగిన


మడుసులంతా కురిసిన జల్లులతో
మురిసిన మడులతో వనవాసం కాస్తా
వాన(దరహస) వాసంగా మారింది





రచనాకాలం 15.07.2012

పతనాల లోయ

పదునెక్కిన సూదిమొనపై 
చిందులువేసే అహం
బంగారంలాంటి 
బుద్దిజీవుడిని పరిమార్చి

కనురెప్పపాటులోనే 
కీర్తిశిఖరం నుండి 
పతనాల లోయల్లోకి 
పడదోస్తుంది

మధుభాండమెందుకు?

చేమంతి లాంటి 
ఇంతి చెంతనుండి
అభిసారికలా 
సుకుమార వయ్యారాలను

వొలకబోస్తుటుంటే 
సుధలొలికే మగువ 
అధరా అమ్రుత
చుంభనంతో ఇహలోక

రసరంగసామ్రాజ్యానికి 
సామ్రాట్ నీవే సుమా
మధురభావన చాలును
వేరే మధుభాండమెందుకు?

శిలా శాసనముల ఈజగతిలో

కమనీయ రంగులతో
కట్టినారు తోరణాలు
సదా మీసేవలోనే
నని నమ్మ బలికినారు


నియంత్రణల పేరిట
నిరంకుశ శక్తులకు
తొత్తులుగా ఈజగతిన
ఘనతి కెక్కినారు


విభేదించినవారంతా
విద్రోహులగా ముద్రణ
నిరసించిన జాతంతా
నిర్మాణ విధ్వంసకులంటూ





వీరంగాలు యెస్తున్నారు
మైనం ముద్దల వంటి
క్రుతులకు ఆక్రుతులపైన
అధికారాలెక్కడవంటూ


కుత్తుకలు తెగకొస్తున్నారు
ఆడిన ఏ ఆటలో వోడినా
మాదే బ(గె)లుపంటారు
వారి తప్పిదాలన్నింటికి


డూడూ బసవన్నలమని
మనం తలలూపామంటే
పద్మవిభూషణభరిత
పరమాంద భా(త)స్కరులం





రచనాకాలం
20.07.2012

చేపపిల్లలా చెంగనాలు

చేతిలోని చేపపిల్లలా చెంగనాలు పోతుంటే
మొహంపై ముసురుకున్న ఆనందమంతా
మధురభావనలతో ఈజగతిపై పరచబడిన
పలుకుబడి పలకపై అక్షరాలై పొంగిపొరలాలి


ఆపొర్లాటలో నాబాల్యం పాల పరుగుల
తూనీగ రాగాల పాటలతో వురకలెత్తాలి
వురకలెత్తె బాల్యాన్ని 


మీతో పంచుకుని వోడిపోతాను


వోదిగిపోయిన నాచిన్నారి 


ముంగురులను కూడా
చిరుగాలి తలవూపుతూ రెపరెపలాడిస్తుంది


ఇంకే భాగ్యం కావాలి మలిసంధ్యలోని ఈజీవికి.

మహిళా మణిదీపమా

మహిళా మణిదీపమా నీరాకతో 
మాయిల్లు నవ్యరాగాలతో హరివిల్లంటి
అనురాగంతో పోటి పడుతుంది
కొండెక్కిన గుండెకుసైతం

కొత్తవూపిరులుదుతావు 
అరుణోదయంలో కనిపించే
ఆశాకిరణాలు నీ నుదిటి


సింధూరమల్లె పసిడివన్నె
వెన్నెలదివ్వెలు నింగిలోని
తారకలై మెరుస్తాయి.

చిత్రములు-నా భావనలు

వొంటరిగా వచ్చాను
నీచూపుల జడివానలో
తడసి జలబుతో
నీతో జత కట్టాను

జతగా వనవిహరంకై వస్తాము
వూసూలాడుకుంటాము
నాట్య విన్యాసాలు చేస్తాము
నాలుగు రుతువులు గడిచాక

నవదంపతులై నవరసజీవితాన్ని
నయనాందకరంగా గడుపుతాము
మలిసంధ్యలో ప్రేమనే
గరిమనాభి కేంద్రంగా

ఒకరికొకరు వుతమవుతాము
కరుణలేని కాలం కాఠిన్యంతో
కాటేస్తే తోడులేక జీవితం
మోడైన చెట్టునీడలో

పోగోట్టుకోని జ్ఞ్యాపకాల
తేనేపట్టుకోసం జగతినంతా శోధిస్తాను
వొంటరిగానే వచ్చాను అనుభూతులు పంచిన
పండించిన బతుకు పంటలో పండిపోయాను

చెట్టుపై పండిన పండులాగా రాలిపోతాను
ఈజగతిపై విత్తుగామారి మొలకెత్తి
కొత్తబంగారులోకంలోకి
శిశువునై ఉదయిస్తాను

కాలచక్ర పరిబ్రమణంలో
ఎత్తుపల్లాల పయనంలో
కొత్తపోకడలు పోతాను
ఇలా చిరునవ్వులతో 

కలంతో కమనీయ 
చిత్రాలను నేస్తాను
నాకున్న నాకు తెలిసిన
జీవన చిదంబరం ఇదే.

రచనా కాలం : 24/07/2012

కాలం-తీరుతెన్నులు-తీర్పులు

నిర్మాణమైన, విధ్వంసమైన
సమిష్టిపనిముట్టుతో చేస్తే
వేర్వేరు పూత అర్దాలుంటాయి
ఒకసారి అది జాతీయాభిమానమని


జాతి సమైక్య పర్వదినమని
మరోసారి జాత్యాహంకారమని
విద్వేషభావజల్వనమని
పిలువబడుతాయి


ఒకరికి ఆది పంచభక్ష
పరమాన్నంగాను
మరికొందరికి పారవేసిన
విస్తారాకుగా కనబడవచ్చు


సమయం సందర్భాన్నిబట్టి
అర్ధాలు రూపాంతరం చెందుతాయి
జ్ఞాననేత్రాలకు మాత్రమే
నిజరూపాలు నిక్రుష్టంగా తోస్తాయి.





రచనా కాలం : 25/07/2012

చిత్ర శోభన భావనలు


సుమనయనమ్ములమ్మ
శోధించి సాధించి ప్రసాదించిన
శోభిత అనురాగాల వర్ణమాలిక
రాగరంజిత కుంజితాల
మేళవింపులోమేలిమి
బంగరు వన్నెచిన్నెల అభిసారిక
ప్రక్రుతిమాత శుభాశీస్సులతో
వనదేవతగా మారిన తారక
స్రుష్టికర్త మరులుగొన్న మదిలో
పూచిన మధురభావనల ప్రియపుత్రిక
కణ్వాశ్రమంలోని శకుంతలను గని
తీరని కోరికతో తనువు చాలించిన
చిత్రకారుడు వీడని గతజన్మ
జ్ఞాపకాల పరిమళముల పరవశము
తాలూకు వాడని తలంపులు
తలపుకురాగా సౌందర్యానంద
నందనాలు విరియపూయించినాడు
అందరి ఎదను దోచినాడు
తాను శిలసౌందర్యం పొందిన
ఈ జగతిలోని వారందరి
గుండెల్లో ప్రేమభావనల
జ్యొతులు వెలిగించినాడు
చిత్రంలోని చిత్రాణి
సమ్మొహన నర్తనమై
విస్వసుందరిమణులందరూ
విస్తుపోయేలా జగన్మోహనంగా నర్తిస్తుంది
అమ్రుతభాండంకోసం పాలకడలి
మధనంలో తాను జగన్మోహినిగా మారి
నర్తించిన శ్రీమహవిష్ణు సైతం
మూర్చనలు పొందుతాడు
సరికొత్త వేడుకగా ఈకన్యక
స్వయంవరంకోసం సిరిని
శ్రీచక్రాన్ని వదలి దివిని వీడి
శ్రీమహవిష్ణు భువిపై తిష్ట
వేయదం మాత్రం ఖాయం
దేవ మానవుల నడుమ పోటితో
ఇకపై తప్పక జరుగనున్నది
మూడవ ప్రపంచయుద్దం
పులకింతమదులకు
ఈచిత్రమొక అపూర్వ కానుక
రంజిల్లెడు మనసులతో
రసరమ్యంగా ప్రసన్న
వదన చిత్తులుగా
ఈవేదికపై వేడుక
పూల తోరణాలు కడుతుంది.

రచనా కాలం : 26/07/2012

రక్తాశ్రువులు


కళ్ళకు గంతలు కట్టించుకుని
పడదోసే ఎత్తులకు పై ఎత్తులతో
నేను విశ్వచదరంగ విజేతను
ఆలోచనలు సాగి మూగభావాల
సుడిగుండంలో సుళ్ళు తిరుగుతుంటే
గడియ తీయకుండా తలపుకోస్తావు
మూసిన తలుపులు తెరిచేదెవరు?
వ్యధల తో(డి) రాగాలు జతకట్టేనా?
వేసవి వేడిమికి వాడినది చిగురులత
ఎదలో పొంగుతున్న కన్నీరే ఈకవిత
జ్యోతి జ్వాలగా ఎగసినప్పుడు
వెన్నెల వెలుతురును హరిస్తుంటే
చుక్కాని లేక తీరం చేర (లే) క
చింతల కాష్టంపై కుములుతూ నేను
నిష్క్రమణ ఘడియలు నీడలా
సాగి నన్ను వెంటాడుతుంటే
లోతు తెలియని నీ ప్రేమ కడలిలో
తేలిపొతూ మునకలు వేస్తున్నా
పరిమళ రస రమ్య* స్మ్రుతులలో
స్వాతిచినుకుకై ముత్యపుచిప్పలా
చల్లని మ్రుత్యువు కరుణకోసం
కరాలు జోడిస్తువేడుకుంటున్నా
ఆదేవుడే కోరుకోమంటే
మనిషిగా నాకు మాత్రం
మరో జన్మ వద్దంటాను.


రచనా కాలం :18/05/1983
(*రమ్య " యండమూరి వీరేంద్ర నాధ్ " నవల "వెన్నెల్లో ఆడపిల్ల" నాయిక.)

తరువు:తల(చ)లేని మానవుడు.

తరతరాలుగా తనకు తానుగా
ఎదిగి వేరేమి కోరకుండా 
తనతనువును
నీడగొడుగుగా కప్పి


ఈజగతినంతా తనసేవలతో
తరింపజేస్తున్న కల్పతరువు
కామధేనువులను మించిన
తరుణీమాత లాంటి తరువుజాతిని


తలలేని ఈమానవుడు 


తలదించుకుని మొదలంటా 


నరుకుతున్నాదు 

తల్లిన్ని తరువును 




పొగొట్టుకున్నవాడు
ఈతి భాధలతో విలపించడం
మాత్రం తధ్యం సుమతీ.





రచనాకాలం:28/07/2012

నీకూ నాకూ మధ్య నిశ్శబ్దం.

నింగీ నేలా నడుమ 
దూరమెంత అ నంతం
అయినా అనుబంధంతో అనుదినం
పరస్పరం ప్రతిబింబాలవుతాయి


అనంతంగా సాగే రైలు పట్టాల
నడుమ దూరం మనల్పం కాదా?
కానీ వాని నడుమ కొనసాగేను
పూరించలేని అగాధాల అనంతరం


కళ్ళతోటి సంభాషించుకునే
భావన్వేషణ చిత్రాలం మనం
ఇంపైన సంగీతం కన్న మన
మౌన భాష మరీ మధురం


ఇందులోని రాగాలకు తాళాలకు
తకిట తకిటలకు లేదు అపస్వరం
పడుతూ లేస్తూ పరుగులు తీస్తూ
ఎ (డ) ద తెగని భావవేశంతో


కాలగమనంతో పోటీపడుతూ
చేరువలోనే తీరమున్న
చేర(లే)ని భార కెరటాలం
మూగ మురళి పలికే వేణురాగ


అనురాగపల్లవుల వూయలలో నిద్రిస్తూ
సువిశాల జగతిలో అనంతకాలవాహినిలో
నిశ్చలంగా నిరంతరం సమాంతర
సరళ రేఖల నడుమ దూరం సాక్షిగా


పయనిస్తున్న మూగబాటసారులం మనం.





రచనా కాలం: 18/06/1983.

కావ్యసుందరి_ కమ్మని నా తలంపులు.

దివినుండి భువికి దిగివచ్చిన
నయనాందకర నవ పారిజాతం
మేలిమి పసిడి వన్నె ఛాయతో
మిసమిసలు పోతూ చందన పరిమళ


తిలకాల సింగారాలు రంగరించుకొని
అష్టవిధ నాయికల్లో
ఒక్కత్తిగా హోయలొలుకుతున్న
కుందనపు బొమ్మను కన్న


నాగుండెను కోసి గుడిగా మలచి
కొలువు తీర్చేపనిలో నున్నాను
వద్దని వారించే వారిని ఇక
హరించి దివికి సాగనంపుతాను


వలపు తలపులను ఆటంకపరిస్తే
జరగబోయే పరిణామాలకు
ఫలితాలకు వారే భాధ్యులు సుమా
అని ఒక భావకుడిగా నా (ని) వేదన.





రచనా కాలం: 29/07/2012

కవి(త)త్వం


ఏ కాలంలోనైన
కవి మదిగదిలోని
జనహిత లోచనాల
యోచన కవిత్వం


యేటిఒడ్డున ఇసుక
వూటలోని నీటిలాగా
ఎప్పటికప్పుడు
తోడబడుతుండాలి.

చెలి చెక్కిన శిల్ప భావనలు

చక్కనైన చెలి చెక్కిన
చిక్కని భావానురాగాల
తలపుల తరంగాల గంగా
ప్రవహ శిల్ప పలుకుబడులకు
సునామీ సైతం బలహీనపడి
చిన్నబుచ్చుకున్న వదనంతో
తేలిపోయిన మబ్బుల మాదిరి
నీరుగారి మూర్చనలు
పోవడం మాత్రం ఖాయం
ఎదలోని వేదనల నివేదనల
నైవేద్యమంతటి నిజమే మరి.





రచనాకాలం: 31/07/2012

ప్రేమ: పడవ:పరవశానందం.

ప్రేమ పండిన నవదంపతుల
పరవళ్ళయాత్రకు తానుచుక్కాని
నని తలపోస్తుందీ ఈ పడవ
ప్రణయసాగరంలో తేలనున్న


ఆజంటను మనకంటిపాపలని
నెంచిన వారందరి డెందములన్నీ
ఆనంద సంద్రాలై నుప్పొంగవా.





రచనా కాలం:01/08/2012

స్నేహమయ నీ కళ్ళ కనికట్టు జాలంలో


నీ కళ్ళు చేయుకనికట్టు
మాయజాలానందంలో
నను నిండుగా మునగనివ్వు
చెదరని ,చెరగని


నాకంటిపాపలో వెలిగే
స్నేహమయ దీపం నువ్వే
తరుణీ నీవు కనురెప్ప
వాలిచిన తరుణములో


ఆశలింకిపోయిన నామది
పరితప్త ఎడారిగా మారును
నా హృ(ఉ)దయ కవాటాల్లో
పలువరింతల పరవళ్ళ


ప్రవాహ గంగ సాగాలి
యే పండుగలు చేసుకోలేని
తలపోతలతో తరిస్తున నాకు
నువ్వు రామప్ప గుడిమోమున


అనురాగవదనంతో విరిసిన
నాగిని లయపదఘట్టనలో
మెరిసిన తారకవు
లోచనల యాచనలో


తన్మయ తటాకవనిలో
విరబూసిన కలువుల
తెలి చిరునవ్వుల కమనీయ
నవ్య కిరణజన్య సం యోగ


క్రియాప్రయోగంలో
ప్రక్రియప్రేరణంలో
ప్రభావతిగా మారిన
సుధామధురభాండం


మధువులొలికే నీ పెదవులందు
కట్టబడిన జలపాతం కాగా
తీపనే నీవు మక్కువగా
నేనే తేనేటీగగా మారి


నీముఖారవిందం ముందు
ప్రదక్షణాలు పోతాను`
హసించినా దరహసించినా
పట్టుదప్పి జాలువారు


పట్టుతేనే తుంపరకై నేను
యాచకునిగా
దోసిలి పడతాను
కాదనలేవు కళా సుందరి.








రచనా కాలం: 05/08/2012.