Monday, October 22, 2012

నాలోని మూడు ప్రపంచాలు.


కారణమేది లేకుండానే
వూహలు, ఆశలు జతకట్టి
వయ్యారాల తూనీగ మది
హరివిల్లుగా మురిపిస్తుంది.

విస్తరిముందు వడ్డించబడ్డ
ఘుమఘుమ పరిమళాల
రసాల సామ్రాజ్యంలోనే
జీవితభూమిక బందీ అవుతుంది

శిఖారాగ్రం మలుపులో
వేగమను ఉల్కపాత విధి
సారించిన వీక్షణంలోనే
కనురెప్ప వాల్చని క్షణంలో

అప్పటిదాకా సజావుగా
సాగినా చక్రాలబండీ
చీలిన చీకటి బాట
గుంటలో దిగబడ్డది.

అదృష్టచక్రం తిరుగబడి
విరిగిన కొండచరియగా మారి
పతనాల లోయలోకి తోస్తుంది.
ఎమి చేయలేని మూగను నేను.

నాకు ఎందుకిలా జరిగింది
నాకు తెలియకుందానే
మరోకరి జీవితదీపం
ఆర్పినానని ఒప్పుకోలేను.

దిగులుతోడు లక్ష ఆలోచనాలు
సవాలక్ష కూడికల హెచ్చవేత
భాగహర తీసివేతల గణనలో
మిగిలిన శేషప్రశ్నకు చిక్కినాను.

పాసంగమను త్రాసు తూచిన
పాయసం నకు లోబడిన
పసిపాప పాలబుగ్గల
పసిడి మది నాదిపుడు

తెలిసిచేయలేదు చెడును
నేనెప్పుడు మోయలేదు
నేరం నాది కాదని నెడుతుంది
కారణాన్ని త్రోసిపుచ్చుతుంది.

మది నెగడుగా మండుచున్నది
దీనికన్న ఖండాంతరాల
ఎడారి జరిపే విస్ఫోటనప్రయోగ
విషఫలితం కూడా చిన్నదే మరి.

ఎవరుచూడలేదని డాంబికాలు పలకినా
కాకరకాయరసమంటిన మది మాత్రం
నెలతకు, కలతకు కూడా నీవే
కారణమంటున్నది నిక్కచ్చిగా

కోటి పరామర్శాలున్న నాగొంతుకు
అనంతకోటి లోచనాల కవాతులతో
సులోచన పటకంగుండా పరిశీలన
వివేచనతో వేధిస్తుంది,వెంటాడుతుంది.

కాగుతుంది, చితి మంటలను ఎగదోస్తుంది
నెమ్మది రాజేయాలన్న ప్రేమ
రాయబారిగా మధ్యవర్తిత్వంతో
శరణార్ధిగా క్షమను కోరమంటుంది.

సాగిలబడి తప్పంతా నాదేనంటాను
దించుకున్న మొకంతో తలబాదుకుంటాను.
స్వాంతన వచనం నుపదేశించిన దీదీ
మానవత్వం మాత్రం నదిగా పొంగినది.

వంగిన నావెన్నెముకకు
వెన్నపూసను నిటారుగా పూసింది
మబ్బులీడిన ఆకాసం తాను
ఆనందంగా అద్దంలో కనబడుతుంది.


01/10/2012.


...
రామాచారి బంగారు.
01/10/2012.

No comments:

Post a Comment