మనిషిగా కనబడుతున్న
నేను తెలిసి తెలివిగా
తప్పులెన్నో చేసి గెలిచినాను
నాడు అహంతో తలెగరేసినవాడనే గాని
ముందుగా మేల్కోన్న
శరణార్ధిలా నాతల
మనసులోఓమూల
ఓటమితో ఒదిగున్నది.
నేడు ఒప్పుతో నేస్తంకట్టి ఓడిపోయినాను
తలెత్తిన మనసు కవచమై గెలిపించింది
నిజంగా నన్ను వెలుగువాకిట నిలబెట్టింది
మన జీవనగడియారాని కీ(లో)లకమదే.
మన జీవనగడియారాని కీ(లో)లకమదే.
19/09/2012.
...రామాచారి బంగారు.
No comments:
Post a Comment