మోడైన చెట్టంటి ఎడదను
భావజాలపు వడ్రంగిపిట్ట
భావజాలపు వడ్రంగిపిట్ట
సూదిమొనవంటి తన ముక్కుతో
తూట్లు తూట్లుగా తొలుస్తుంటే
తూట్లు తూట్లుగా తొలుస్తుంటే
భారజలమంతా మదినిండి
ఎత్తిపోతాల జలపాతమైన
క్రిష్ణవేణీ నదీ తరంగాలు
నాగార్జునసాగరంగా నిలిచినా
ఎత్తిపోతాల జలపాతమైన
క్రిష్ణవేణీ నదీ తరంగాలు
నాగార్జునసాగరంగా నిలిచినా
కవితాదాహమెన్నడు తీరదు
సాగనీండు ఈ దీనుడి
ఎడతెగని పయనం ఈజగతిన.
సాగనీండు ఈ దీనుడి
ఎడతెగని పయనం ఈజగతిన.
రచనా కాలం.16/08/2012.
No comments:
Post a Comment