Monday, October 22, 2012

నీడ_నిజం






ఎంత అందమైనవాళ్ళు
ప్రకృతిలోని
శోభనంతా
కలబోసుకున్న

కలనేతచీరలను
గుత్తగా చుట్టుకుని
అందాలన్ని తమవే నన్న
సుమలత ల్లాంటి ఆడవాళ్ళు.

సుకుమారం, ముగ్దత్వం
మురిపాల మూర్తులుగా
పోతపోసాడు ఆ బ్రహ్మ
పక్షపాత ముద్రతోనన్న

భావనను కలిగియున్న వాడినే
గానీ చదువులమ్మతల్లి
గారాల బిడ్డలుగా నుండి
శాస్త్ర పారంగతులైనా

జీవనసాహచర్యమను బాటలో
కొనుగోళ్ళ త్రాసులో ద్రవ్యానికి
తూచబడలేని గీటురాళ్ళు
కన్యకా పూర్ణమ్మ ప్రమిదలే

కాలుతున్న పూదోటలోని
బంతులు, చేమంతులే కదా
ఇంతులుగానున్న తోబుట్టువులే మరి
అగ్నిపర్వతాలను దాచుకున్నవాళ్ళు

తాము కరుగుతున్నా వెలుగు దివ్వెలు
పంచుతున్న హిమ్మోన్నత జాతికి
శిరస్సు వంచి ప్రణమిల్లుతున్న నేను
పాపభారం దించుకునే శరణార్దినే.

14/10/2012.
...
రామాచారి బంగారు
రచనా కాలం;15/06/1982.
(ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణం).

No comments:

Post a Comment