కులాల పాకుడురాళ్ళపై ఎగబాకి వచ్చిన దళిత జీవితాలు ఇప్పుడు ముద్రణ పొంది మనందరి ముందుకు వచ్చి జఠిలమైన ప్రశ్నలు వేస్తున్నాయి. ఎన్ని తరాలకూ మారని రాజకీయ ఆర్ధిక చిత్రాన్ని గీసి చూపించి సమాధానాల కోసం గల్లా పట్టుకొని అడుగుతున్నాయి. గుండె, గొంతు ఒకటే చేసి ఈ పుస్తక జీవితాలతోఖచ్చితంగా సంభాషిద్దాం. నిజాన్ని నిప్పుతో కడుక్కోవాలిసిందే.ఎక్కువకాలం మనం నిజంగా మనుష్యుల్లాగా ప్రవర్తించలేదని నిజాయితితో ఒప్పుకోవాలిసిందే.ఇంతకాలం ఈ వ్యవస్థలోని అన్ని సామాజిక రుగ్మతలకు మనం మారకపోవడమే కాదు,మాట్లాడకపోవడం మూల కారణమన్నదాన్ని ఆత్మసాక్షిగా కారణభూతులైనవారందరం మనమే కదా.ప్రాయశ్చితంతో నడివీధిలో ముక్కును నేలకు రాసుకోవాలి.జీవనయానంలో గౌరవఫోరాటంలో తనదైన పోరాడే బాటను, ప్రశ్నించే పటిమను అక్ష్రరబద్దంచేసి అద్దంలో చూపినారు.నాకు నచ్చలేదని ఎలా విసిరి కొడతావు?. డాక్టరు యం.ఫ్ గోపినాధ్ "నా పొగరు మిమ్మల్ని గాయపరచిందా? అయితే సంతోషం!" మూగబోయిన ఒక గళం సంధించిన అక్షరంతో ప్రశ్నించిన ధర్మాలెన్నో?