Tuesday, November 27, 2012

// కల(త)ల రేయితో నిరీక్షణ //


// కల(త)ల రేయితో నిరీక్షణ //

రామాచారి బంగారు.

నా కలలు పండగా
నాకన్నుల పండుగగా
నువ్వే సమ్మోహినిగా
ఆనందభైరవిరాగంతోడి

అలంకృతవతిగా నాచెంతకు
రేపే రానున్నవని ప్రమోదంతో
చిత్రకారుడు తెలిపిన ఈతరుణాన
ఊరిస్తున్న ఉత్సుకత జాలువారగా

వెన్నెల చంద్రుడొస్తున్నవేళా
సిరులకలువ విరిసినచందంగా
నీదైన మాయలోనిండుగా మునిగిన
మురిసిన నామది గమ్మత్తుగా మూగదైనది.

ఆశపడుతున్న నాతో నువ్వు
యుగళగీతం పాడుతూ నర్తిస్తావన్న చిలిపి
తలపు తళ్ళుకున మెరవగానే ఈరేయి
సాగనిదై మోయలేని భారంగా తోస్తుంది.
26/11/2012

Sunday, November 25, 2012

// కల నిజమైన వేళా //


// కల నిజమైన వేళా //
రామాచారి బంగారు

కలలందు కవ్వించిన
కమనీయ రూపలావణ్య
లలిత రూపసుందరి
ఆకాశతారమణిదీపం

తనకు తాను దివినుండి
దిగివచ్చి ధీరోదాత్త
కావ్యనాయికనేకాదు
నీ నిజజీవితంలో కూడా

కధానాయికనని
మర్మతంత్రమే కాదు
మన్మధ బాణం సూటిగా
ప్రయోగించినదేమో

మర్లుగొన్న నామనసును
తన తీక్షణ వీక్షణంతో
ప్రేమ సంకెళ్ళతో బంధించిన
స్థితిలో నేను నిజంగా బధిరుడినే .

25/11/2012.

Saturday, November 24, 2012

//చిత్ర సుందరి//


 //చిత్ర సుందరి//
   రామాచారి బంగారు.

   చంద్రకాంతుల చిత్రకారుని
   నిశితశైలికుంచెకు చిక్కని
   వర్ణాల మేళవింపు విన్యాసంలో
   పోతపోసిన సరికొత్త అనురాగాల

   హరివిల్లు సొగసులచందనవతివే
   నా స్వప్నరాగలీనవు నీవే.
   కళ్యాణి,శివరంజని కలబోతలతో
   కాకలుతీరిన రసరమ్యమంజరివే

   నీవు కలనైనా ఊహించనంతగా
   నాహృదయద్వారంలోని రుధిరానంతా
   నీకు సింధూరంగామార్చి ప్రేమ
   సింహాసనంపై కూర్చుండబెట్టాను కదా.

   యేళ్ళు గడుస్తున్నా నీదరికి చేర్చుకోవడానికి
   నీ సుకుమార కరకమలాలుకరుణించవా?
   కారణాలు చూపకుండా నిజం చెప్పవా?
   సూదంటురాయిచూపుల నిశ్చలశిల్పసుందరి ?
          24/11/2012.

Friday, November 23, 2012

//పులకించిన మది పరవళ్ళు//


//పులకించిన మది పరవళ్ళు//

 రామాచారి బంగారు.

ధీటైన పౌరుషానికి
దివిటీల ధగధగలతో
నిలువెత్తు నిగనిగలనే
నగలతో నిరుపమాన

కీర్తి చంద్రికలతో
విలసిల్లుతున్న గారాల
వనమయూరమా నిను
గాంచిన నామది మురిసినది.

చినుకు రాకకోసం
కళ్ళు కాయలుకాయగా
ఎదురుచూసి అలసి
సొలసిన మందభాగ్యుడను

ముసురుబట్టిన రేయిలో
తడిసిన మొక్కలాంటి
స్థితిని నేనేనమని
వర్ణింపగలవాడను నేను?.

24/11/2012.

Tuesday, November 20, 2012

//నీమదికో విన్నపం//.


//నీమదికో విన్నపం//.

రామాచారి బంగారు.

తూర్పుదిక్కునుంచి
జగతికి మహత్తర
చిత్ర వెలుగురేఖలు
పంచే నా ప్రేమికుడా

నామదిని స్పర్శించి
ద్రవించిన ఉదయుడివే
బరువెక్కిన నాగుండెను
ఈరేయి భారంగా మోస్తుంది

ఎప్పటివలే కాకుండా
వేగిరమే రెక్కలతోవచ్చి
గదిలోని నా ఒంటరి
వలపుతో సరాగాలు పాడించవా. 21/11/2012.

Monday, November 19, 2012

// నిజం //


// నిజం //
రామాచారి బంగారు.

ఎవ్వరూ అర్థం చేసుకోని గొప్పతనాన్ని
ఆదేవుడు శీతల హిమాలయమంత
విశాల హృదయంతో చూస్తాడన్నది
నమ్మకమేకాదు వాస్తవమే

దశదిశల ప్రమేయగణనలతో
కాలంతో, కాంతితో పోటిపడుతూ
వేగవంత ప్రవాహంలో ఈదులాడుతారు
దీవెనలతో గట్టుకు చేర్చబడతారు

విలువలకు పట్టంగట్టే వారిని
ఏకాలంలోనైనా రెప్పవేయకుండా
కారుణ్య లోకం అమ్మలా
గమనిస్తుంది,కాపాడుతుంది!

విశాల వీక్షణమన్నది
శూన్యమదిలో విశ్వపరివ్యాప్త
సూక్ష్మబిందువుల సమూహన్ని
దుర్భినిలో పట్టని తత్వశాస్త్రమే

ప్రయోగాల పరిశోధనల
పరీక్షనాళికలలో
చడీ చప్పుడు లేకుండా సాధించే
ఎన్నో విజయాలకు అదే మూలకం

పరులు నిన్ను వేలెత్తి చూపినప్పుడు
వివేకవచనల లోచనాల
సిద్దాంత ప్రాప్తకాలజ్ఞానుడివినీవే
ప్రామాణికతకు సాక్షి కాలమే

నోటి వాటం, కంటి చూపులతో,
కాటేసే సాటి వారికి ,తెరచాటుగా
చేసే వ్యాఖానాలకు వెరవకు!
పోరాడు, గెలుపు తథ్యం!

బలమంటే సైన్యం కాదు నేస్తం!
అదే మొక్కబోని నీ గుండె ధైర్యం.
నీలోని గొప్పతనమెప్పుడూ
సామాన్యంగానుండి వెన్నంటుతుంది.

సాదరంతో ఆహ్వనం పలుకుతుంది.

ఈప్రపంచాన్నితన నేత్రంతో పరిశీలించి,
పట్టించుకుని ప్రతిస్పందించేవారి
జీవితాలు మాత్రమే దన్యత నొందుతాయి.

(కందాల ఉషారాణి గారి కవిత స్ఫూర్తితో).18/11/2012.

Wednesday, November 7, 2012

ఆత్మలను అమ్ముకున్నవారు జాతి దీపాల నార్పుతున్నారు.


 రామాచారి బంగారు.
//ఆత్మలను అమ్ముకున్నవారు జాతి దీపాల నార్పుతున్నారు//.

నగదురూపాలకు
ఆత్మలను అమ్ముకున్న
పసలేని వాదుల
కోనుగోలు మాటలు

పదునులేని కత్తులుగా

మారి మాజాతి
శిశువుల గుండెల్లో
బలవంతంగా దిగబడుతున్నాయి.

కొందరి మాటలు పూటపూటకు
రెక్కలు లెక్కలు కట్టుకుని
కాళరాత్రి దీపంపురుగుల్లా
రోజులపాటు విసిగిస్తాయి.

జీవితాలను క్షణాల్లో
చిందరవందర చేసే
చిత్రాల మాటలు
క్షణికావేశ ఫలసిద్ద చితి మంటలే మరి.

బంతులెగరెస్తున్నవారు
ఉదయభాస్కరులే
ఉజ్వలక్రాంతి
రంగంలో బాలచంద్రులే

మండుతున్న ఉద్యమ
సూర్యునితోపాటు
అణగారిన జాతి
వేదనలకు వారసులు.

పాత పాటకే వారేవా
అంటూ తలలూపే
డూడూ బసవన్నల
నిగ్గదీసి నిలదీసేడివారు.

అర్ధరాత్రి ప్రకటనకు సంబరపడ్డవారు
ఉరికొయ్యల వుయ్యాలకు
ఉక్కు గొలుసులకు తమ తలలను
పూసల పురికోసగా పేనుతారు.

చెరుకుముక్కకు చేదుకాకరను తలంటి
మానని పుండుతో ఎత్తుపడ్డ ఎద్దును
ఫొడుస్తున్న కాకి ముక్కుమార్కు
సిద్దాంత వారసుల వ్యాకరణాలకు

సాచివేత, సాగదీత పెద్దల సుద్దులకు
మహనగర ప్రవేశ కూడలిలో తల్లడిల్లి
తగలబడి అగ్నికి తనువు అరువుగా
ఇచ్చిన ఉదజని పుత్రులు తారకలేమరి.

వందలాది అమ్మల కడుపు కోతల
ఆక్రోశంతో కన్నీటికడలిలో భాస్వరములు
మండి ఆవిరిగా గూడుకట్టిన శోకం
తాను వానను కంటుంది.

ఫంట భూములను
చవిటి పర్రలుగా
పరిమారుస్తుంది.

గ్లిజరిన్ తో తెచ్చిపెట్టుకున్న
దిగుమతి ఏడుపుల ఎడారిలో
సేద్యం చేస్తామంటూ
సానుభూతి రాబందులు

సామూహిక కూటములన్ని
ఆరు నూరు అని పొంతనలేని
తీరొక్క రాగాల మాయాబజారు
సంతార్పణ తిరుణాళ్ళలో

ఉచిత భొజనమమృతమను
మంత్రాంగ తంత్ర
పాక మంటించిన
బలహీన చికిత్సలు సాగుతాయి.

జాతిసంపదకు
చెదపురుగుల
నంట గట్టిన సూత్రధారులు
గాంధారికి తోడబుట్టినోళ్ళే

తమది మరింతగా వేచివుండు
విశాల స్వభావమని ప్రకటించిన
ప్రబుద్దులు మాసిపోయిన రంగుల
విహీన విద్వంస కలల ప్రపంచంలో

రోతకు పూసిన పూతన
ముఖస్తుతి గణంలో
మరకగోడకు రాలుతున్న
సున్నాలై ప్రకాశిస్తారు.

మావృతాంతంలో చిక్కిన
శరణార్ధగతుల బ్రతుక్కు
నిలువ నీడనిచ్చి
కాపాడుతున్న సంస్కారం మాది.
02/10/2012.