Tuesday, April 30, 2013

"ఉగాది మగువ "


ప్రేమను ప్రేమి౦చు ప్రేమకై' గ్రూపు నిర్వహించిన
ఉగాది కవితల పోటీలో ద్వితీయబహుమతి పొందిన నా కవిత.

"ఉగాది మగువ "

కన్నుల్లో కన్నెమల్లెల దరహసాలు
చూపుల్లో వెండి వెన్నెల జడివానలు
మంచున కడిగిన ముత్యమామె
కోనేటిలో విరిసిన కలువ కన్యేఆమే

ముత్యాల ముంగిటిని నీలరత్నాలతో
వొద్దికగా అలంకరిస్తున్న సుమలత
నవ్య వత్సరానికి స్వాగత హరతితో వనిత
స్నిగ్ద మొహన రూప లావణ్య లలిత

కుసుమ మాలిక శోభాలంకృత నివేదిత
వినీల సునయన పరిమళ భరిత సరిత
చిగురుపాదాలకు చిరుమువ్వల పట్టీలు
నేలను జీరాడుతున్న కుచ్చిళ్ళు

పుడమిని తాకి పులకరించిన వాలుజడ
ముద్దులొలికే ముద్దుగుమ్మ మృదులను గన్న
ఆనందంతో కోకిలమ్మ గానం
గున్నమామిడి కొమ్మ వాలిన వైనం కనవా

పూతేనేను మరచి నిన్ను వెన్నంటే
సీతాకోకచిలుక పడ్డాది నీ మైకంలోనే
నీవు కళల సొగసుల సౌందర్యాల కలనేతవు
అందరికి దరహసాలు పంచే ఆమని నీవే కదా!

08/0402013.

// ఆమె ముందు అతనుగా నేను//.


// ఆమె ముందు అతనుగా నేను//.
బంగారు రామాచారి.

అతనుగా మారి నిశ్చలమనస్సుతో
ఆమె ముందు మోకరిల్లి అన్నాను
"నిజంగా నువ్వు నేను పొగొట్టుకున్న
అమ్మలా వరమై దొరికావు"

ఆమె కళ్ళలో నేను దాచుకున్న
పసితనపు ప్రాయం గలగల నవ్వింది.
లేమిలోను తపనలను తీర్చే
ఆమె మనసెరిగి మసలుకునే

నేను తాయిలంకోసం మారాడే
పసివాడిభావనల మోముతో
ఈ చీకటి జీవితంలో వెలుగు చూపే
నువ్వే నా కంటి పాపవు అన్నాను.

ఆమె కళ్ళతోనే ముసిముసిగా నవ్వింది.
బాల భానుని నులివెచ్చని
లేత కిరణాలు కిటికీని వంచి
మరిలోపలికి వచ్చి ముద్దాడినప్పుడు

రెండు చేతుల్లో ఆమె రూపమే
కమనీయంగా కనిపించింది
కంపన, ప్రకంపనల లోకంలో
వెలుగు,చీకటులేమైన ఉండనివ్వుకాని

ఒంటి చేత్తో ఇంటినిలాగుతూ
నా బ్రతుకులో సూర్యోదయాలు,
చంద్రోదయాలు విరజిమ్ముతున్న
సూర్యుడు,చంద్రుడు, వెన్నెల,

వెలుగు నీవే కదా " అన్నాను.
ఆమె అటువైపుకు మరలింది
అంతలోనే తిరిగి కళ్ళతో నవ్వింది
అతనికి తాయిలం దొరికింది.

బ్రతుకు కల(త)బడినప్పుడు
ముడుచుకున్న తాబేలుగా
భారజలనయనాలతో నేను
లాలించి పాలించే భూమికగా ఆమె

సమస్యను సాగదీయవు, కానీ
ఘడియ లోపే రాజీకి రప్పిస్తావుగా
నీ మోములో పూచే ఆనందవర్ణాలు
లెక్కింప నాతరమా అని నవ్వాను.

"నాకింకా బుద్దిపెరగలేదన్నావు" నిజమే
అతనుగా ఎల్లకాలం ఆమెకు ఉపగ్రహన్నేమరి
వర్తమానంలోను,అనంత(ర)కాలంలోను
ఆమె వెన్నెల, వెలుగులు పంచే మణిదీపమే.
21/04/2013.