Monday, October 22, 2012

జీవ(న)కారుణ్యమది.



ఏ కాలంలోనైనను
జీవిని సజీవంగా
నిశ్చల స్థితిలో
నయనం చూపే(దే) చిత్రం.

అవనిపై జీవనం
వనములతో కూడి
ఫలవంతంలైన
అభయారణ్యంగానుండి
ఈజగతికి నీడనిచ్చి
బ్రతుకును నిలుపునది.

పర్యావరణం
అనుమతించనినాడు
మనందరి బ్రతుకులు
వల్లకాడుకు వరసిద్ధి ఫల
ఉద్యానవనములగును.

తాను వైవిధ్యంతోనుండి
సజావుగా మనందరకి
అభయమిచ్చి పోషిస్తున్న
పరమ పావని

పుడమి తల్లికి మొక్కి
కోట్లాది గొంతుకలతో
సదా విధేయులమని
నేడు ప్రతిజ్ఞ పూనుదాం.

మర్చిపోయిన కారుణ్య
గుణమును వెలికితీద్దాం
మన భావితరాలకింత
పిల్లగాలిగా నిలుపుదాం.





06/10/2012


...
రామాచారి బంగారు.


No comments:

Post a Comment