Monday, October 22, 2012

అనుబంధం నీతోడిది.




కల్లకానిది, ఎల్లలు లేనిది
అనుబంధం నీతోడైననది
సువర్ణశోభన భూపాలరాగ
జలపాతమై జాలువారునది


జలతారు వర్ణాలహరివిల్లు
ప్రణయరాజ్య అధిపతిగాను
నాకు పట్టం కట్టిన రాణే ఆమే
పరిపూర్ణమణిమయ ప్రేమకు


జాగీరుదారుహక్కులన్నీ ఆమెకే
అనురాగవర్ణాల సాంగత్యంలో
యేళ్ళు, పుష్కరాలు గడుస్తున్నా
అంబరమంటిన సంబరాన్ని నేను


మరింత దగ్గరగా కంటున్నాను
జిజ్ణాస ప్రవాహ దిశగా సాగుతున్నా
కనుమరుగవ్వని బంధం సాక్షిగా
ఆమె కనురెప్పల నడుమ పాపనే.








20/09/2012.

No comments:

Post a Comment