ఏనాడూ నీహృదయాన్ని విప్పకు
వీలైనన్ని ఇరుకుగదులుగా విభజించు
అందమైన అపస్వరాలను
అసంఖ్యాకంగా ఆహ్వనించు.
అక్షరాదిక్రమంలో
ఆక్షరణీయంగా
ఆనందంతో
అమర్చుకోవాలి
రగులుతున్న అగ్నిపర్వతం
నుండి వెలువడే లావాలా
ఏదో ఒకరోజు ఉపద్రవంగా
నీహృదయాంతర కవాటాలను
పెకలించుకొని పెనుగంగలా
వాకిలి ముంగిట వెల్లువవుతుంది.
అప్పుడు నిశ్శేష్టుడవైనా
నివురుగా రగిలిపో నిజంగా
నీలో అదృశ్యంగా ఉండి
వెన్నంటి నడిపించేది
అదేమొక్కబోని
దిట్టతనగుణమది
చెక్కుచెదరక నీలోఘోషగా
మిగిలిన ఆర్తజనగళమే.
08/10/2012
అమర్చుకోవాలి
రగులుతున్న అగ్నిపర్వతం
నుండి వెలువడే లావాలా
ఏదో ఒకరోజు ఉపద్రవంగా
నీహృదయాంతర కవాటాలను
పెకలించుకొని పెనుగంగలా
వాకిలి ముంగిట వెల్లువవుతుంది.
అప్పుడు నిశ్శేష్టుడవైనా
నివురుగా రగిలిపో నిజంగా
నీలో అదృశ్యంగా ఉండి
వెన్నంటి నడిపించేది
అదేమొక్కబోని
దిట్టతనగుణమది
చెక్కుచెదరక నీలోఘోషగా
మిగిలిన ఆర్తజనగళమే.
08/10/2012
...
రామాచారి బంగారు
No comments:
Post a Comment