Tuesday, October 23, 2012

పలుకుబడుల బందిలో పలకలేని బాలుడీ వాగు.



యమున నది యన్న మా అమ్మేనని తలచినా
ఆలమందలచుట్టూ అమ్మార్తితో చెంగుమంటూ
గంతులెత్తుతూ అంబా యని అరచు లేగదూడ వల్లే
బిరబిరమని పరుగులెత్తు నాగులాగు సాగునది వాగు

తెగిన గట్టునుండి పారు నీరును తెగ తాగి పొంగిపొర్లు
వరదవాగు చందమల్లే పరుగులుతీయు ఆలమందలు
మొహనాల, సమ్మోహనాల మనోహర మురళుడి
గాన చావడిలో గుదిబండగుంజలకు గుత్తగా కట్టబడి

స్వరాలమంత్రగత్తె తంత్రాల సిద్దివరాల సోదరుడు
వెదురు వాకిట రాగాలానుబంధాలక్రుతులు దిద్దిన
గారాలబిడ్డ వేణువు పాడిన నాగస్వర వంశీకరణ
సంకీర్తనలు చిందులు వేసిన 
 
వంశవ్రుక్ష వ్రుతాంతంలోనే
అరగని మైమర్పులను నెమరు వేసుకుంటున్నాయి
బడిలో పంతులు ముందు
పలకలేని బాలుడిగా ఉందీ వాగు.
 రచనాకాలం: 29/08/2012.
 

No comments:

Post a Comment