కవిత మనందరిదేనని ప్రతిజ్ఞ పూని, ప్రవచనాలను వల్లించినవారు
కవిత భవితకై పదకోశాన్ని సాన పట్టిన నవ్యనిర్వాహకులమన్నారు
కవితల కళారాధనలో సంవత్సరమంతా కలియతిరిగినాను అన్నారు
కవులసంఘమన్నా మెచ్చుకోలున్నా కూడలి సాక్షిగా నేనున్నన్నారు
కవి మదిలోని అక్షరములలో పసిడి ఛాయతో కలబడినవాడినన్నారు
కవితాకాశం హరివిల్లుతో పులకించుటను తాను మరువకున్నామన్నారు
కవి తలపై పండిన భావతరంగం పొంగినా కీర్తిశిఖరమేనన్నారు
కవితను గూడిన సాహితిసేద్య హాలీకులకిది గండపేండేరమే నన్నారు
కవి తలను మెట్టిన హస్తానికి, రణానికి వీడదీయలేని కవలలను బంధం
కవి తల నెత్తి సారించి ఈజగతి దుస్థితిని కళ్ళారాకని కంటతడిపెడతాడు
కవితా భాస్వరం పాలనాకాలం ఏదైనను మండేలాగుండును గదా
కవి ధిక్కరించి పదునైన కవితా వ్యాఖ్యానంతో నిష్టూరములాడతాడు
కవి శిల్ప పనిముట్టుతో శిలా జగతికి కారుణ్యతోరణాలను కట్టబెడతాడు
కవిత విదేశీయురాలైనను దాచి కాచిన ఘన చరిత్ర తమదనేవారు
కవితా నిర్వాహకులు కాలం తీరిన శాసనాలకు ఇప్పుడు కట్టుబడ్డవారు
కవితా పీఠమెక్కినవారిపుడు పదపాదములనుపట్టి పీడించే జలగలు
కవి తల్లే రోదించి నివేదించిన అర్జీనే నిషిద్దఫలములన్న నిర్వాహకులు
కవిత పరిమళాలచే రంగరించబడ్డా నిర్వాహకుల చేతులబడి బొగ్గైనదీ
కవిత ఇప్పుడు చీకటిరోజుల్లో పాలనకధిఫతి కొండచిలువ నోట చిక్కినదీ
కవిత ప్రస్తుతం నల్ల చట్టాల రాజ్యాధికార మదగజం మింగిన వెలగపండే
కవితా కోయిల ఇప్పుడు మావిమాకే
అనుచిగురులు తిని దౌష్ట్యాన్ని నిగ్గదీస్తుందీ
ప్రశ్నించే వాడి గోసను వినని నిర్వాహకులమనువాదులు గాంధారికి వారసులే
దండుచీమల మహనగర ముట్టడికి గజరాజ నిర్వాహకం తలదించుకుంటుందీ.

...రామాచారి బంగారు.
రచనా కాలం:: 02/09/2012.
No comments:
Post a Comment