Tuesday, July 16, 2013

అప్పుడు _____ ఇప్పుడు.

 అప్పుడు _____ ఇప్పుడు.

  నెచ్చెలి  నువ్వున్నప్పుడు
 ఎక్కడ మల్లెలు కనిపించినా
 నీసిగలో తురుమాలన్న
 తపనతో  పరితపించేవాడిని.

 ఇప్పుడు మల్లెలు కనిపిస్తే
 నీజ్ఞాపకాలతో నాహృదయం
 వక్కలవుతుందన్న భయంతో
 సందుగొందుల్లో భయంభయంగా

 సాగిస్తున్నా నాజీవనయానాన్ని.
 నీవు లేవు , నీతోడి జీవితం
 తలుపుకు వచ్చినప్పుడల్లా
 నాచితిపై నేనే నెయ్యిని

 నాదైన పెద్ద గరిటతో
 నైవేద్యంగా గుమ్మరించుకుంటున్నా.
 జీవితమంటే తళుకుబెళుకుల,
 మెరుపుల మరకల వలయపరివర్తనమా?
                       17/07/2013.


No comments:

Post a Comment